ఏసిపి పార్థసారథి ఇంటిపై ఏసీబీ దాడులు..
పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం..
ఏసిపి పార్థసారథి ఇంటిపై ఏసీబీ దాడులు..
అక్రమంగా దాచిన 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లు, కాట్రిడ్జ్‌ల స్టాండ్ ను ఏసీబీ అధికారులు స్వాధీనం..
పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం..
హయత్ నగర్, మే 13, న్యూస్ ఇండియా ప్రతినిధి: సూర్యాపేటలో ఏసిపి గా విధులు నిర్వహిస్తున్న కొండం పార్థసారథి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. అక్రమంగా దాచిన 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లు, కాట్రిడ్జ్‌ల స్టాండ్ ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. హయత్ నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... హయత్ నగర్ లోని దత్తాత్రేయ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న కొండం పార్థ సారధి, సూర్యాపేట సబ్ డివిజన్ డీ.ఎస్.పి గా విధులు నిర్వహిస్తున్నాడు. సూర్యాపేటలో జరిగిన ఓ కేసులో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సూర్యాపేట డి.ఎస్.పి కొండం పార్థసారథి, సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ పి. వీర రాఘవులుపై సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు కొండం పార్థ సారధి ఇంటిపై ఏసీబీ, హైదరాబాద్ సిటీ రేంజ్-2 అవినీతి నిరోధక బ్యూరో ఇన్‌స్పెక్టర్ సిహెచ్. మురళీ మోహన్, టీమ్ సభ్యులు దాడులు నిర్వహించడం జరిగింది. ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లు, ఒక కాట్రిడ్జ్‌ల స్టాండ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసిబి అధికారులు గుర్తించారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సిహెచ్. మురళీ మోహన్ ఫిర్యాదు మేరకు నిందితుడు కొండం పార్థసారథి ని రిమాండ్ కు తరలించి

, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అతనిపై సెక్షన్ 613/2025 U/s: 25 (1A) (1AA) r/w 7 ARMS Act 1959లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comment List