నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన స్టేట్ యుత్ వింగ్ సెక్రటరీ దిద్దికాటి రఘురాముడు మరియు మంత్రాలయం నియోజకవర్గం వైసీపీ యూత్ విభాగం అధ్యక్షులు నరవ రాజశేఖర్ రెడ్డి .

On
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!

- వైసీపీ యువజన విభాగం రాష్ట్రస్థాయి సమావేశంలో వైసీపీ అధినేత దిశానిర్దేశం...

పెద్దకడుబూరు మండలం/ న్యూస్ ఇండియా ప్రతినిధి జులై 01 :- మంగళవారం తాడేపల్లి లో జరిగిన యువజన విభాగం రాష్ట్రస్థాయి సమావేశంలో మంత్రాలయం నియోజకవర్గం యుత్ విభాగం తరుపున పెద్దకడుబూరు మండలానికి చెందిన వైసీపీ స్టేట్ యుత్ వింగ్ సెక్రటరీ దిద్దికాటి రఘురాముడు మరియు మంత్రాలయం నియోజకవర్గం వైసీపీ యూత్ విభాగం అధ్యక్షులు నరవ రాజశేఖర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది... ఈ కార్యక్రమం అనంతరం వీరు వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అలాగే జిల్లా, నియోజకవర్గం, మండలం మరియు గ్రామంలోని యువతకు జరుగుతున్న అన్యాయలను గురించి వైసీపీ పార్టీ అధ్యక్షులతో వారు చర్చించడం జరిగింది... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలోని చదువుకున్న యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిరుద్యోగ భృతి ఇస్తానన్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అనే అంశాలపై ఆయన చర్చించడం జరిగింది... అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జ్ గా పేరు చెప్పుకొని రాఘవేంద్ర రెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఉద్యోగ పోస్టుకు లంచం తీసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిని బ్రష్టు పట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేల రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు చెప్పిందే కానీ వాటిని అమలు పరచలేదని, అయితే నియోజకవర్గంలో మాత్రం సూపర్ సిక్స్ పథకాలు అన్ని అభివృద్ధి చేశామని ప్రజలకు రాఘవేంద్ర రెడ్డి అపద్దపు మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నరన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు గురించి ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలనాగి రెడ్డికి వివరిస్తూ ఉన్నామని జగన్మోహన్ రెడ్డి కి తెలియజేశారు...అలాగే వైసీపీ పార్టీ తరుపున స్టేట్ యుత్ వింగ్ సెక్రటరీ మరియు నియోజకవర్గం యూత్ విభాగం అధ్యక్షులు గా మమ్మల్ని నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.... మా మీద నమ్మకంతో ఇచ్చిన ఈ పదవులకు తమ వంతు కష్టపడి కృషి చేస్తామని, అలాగే వైసీపీ పార్టీ భలోపేతానికి అహర్నిశలు కష్టపడతామని హామీ ఇచ్చారు.....InShot_20250701_195716055

Views: 101
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'