పేటలో వైసీపీ వ్యూహం ఏంటంటే  ఎమ్మెల్యేను మార్చేసి...!

On
పేటలో వైసీపీ వ్యూహం ఏంటంటే  ఎమ్మెల్యేను మార్చేసి...!

 
ఆంధ్రప్రదేశ్  లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎస్సీ స్థానాల్లో వైసీపీ సిట్టింగులను మార్చే వ్యూహాన్ని వైసీపీ హైకమాండ్ అమలు చేయబోతోంది.  మరి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పరిస్థితి ఏంటి? గొల్లబాబూరావు ప్లేస్ లో ఎవరిని బరిలో దింపబోతున్నారు?

 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ప్రజాతీర్పుకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో ఇఫ్పటి నుంచే పార్టీలు బలబలాలు అంచనా వేసుకుంటున్నాయి. అభ్యర్ధులను అంచనా వేసేందుకు వరుస సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నాయి.  అటు ఈ విషయంలో వైసీపీ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా బలహీనంగా ఉన్న అభ్యర్ధులను అంచనా వేసిన హైకమాండ్.. వారికి ప్రజల్లో ఉన్న మద్దతు ను అంచనా వేస్తోంది. స్థానికంగా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చి..  ఆ నియోజకవర్గాల్లో కొత్త వారిని మార్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది.
ఈ విషయంలో ఉత్తరాంధ్రలో పడిపోయే మొదటి వికెట్ పాయకరావుపేటగా చెప్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై ఇఫ్పటికే తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన మార్పు తథ్యంగా కనపడుతోంది. గడప గడప కార్యక్రమం సహా దేంట్లోనూ పార్టీ కేడర్ ను కలుపుకుని వెళ్లకపోవడంతో.. పార్టీ హైకమాండ్ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉంది. అటు ప్రజల్లో మద్దతు లేకనే ఆయన నియోజకవర్గంలో సరిగా తిరగలేకపోయాడనే అంచనాకు పార్టీ హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. అటు టీడీపీ నాయకులతో బాబూరావుకు లోపాయికారీ మద్దతు ఉందనేది కూడా వైసీపీ కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఓటు బ్యాంక్ తగ్గిపోతుందని  అందుకే కొత్త అభ్యర్ధిని బరిలోకి దింపే వ్యూహాలను రచిస్తున్నారు.WhatsApp Image 2023-09-30 at 4.03.08 PM

Views: 127
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.